UA-35385725-1 UA-35385725-1

సౌర రంగంలో మూడు నెలల ఉచిత భోజన వసతితో నిరుద్యోగ యువతకు శిక్షణ

సౌర రంగంలో మూడు నెలల ఉచిత భోజన వసతితో నిరుద్యోగ యువతకు శిక్షణ

న్యూస్‌తెలుగు/వినుకొండ : నిరుద్యోగ యువతీ, యువకుల కోసం నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఐఎస్ఈ) సహ కారంతో ఆంధ్ర ప్రదేశ్ న్యూ, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సౌర రంగంలో ‘సూర్యమిత్ర’ పేరుతో ఆషా సొసైటీ నందు శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ కరిముల్లా తెలిపారు.
శిక్షణలో చేరిన వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. బుధవారం వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ఆషా సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ యొక్క సోలార్ ఇన్స్టాలర్ కోర్సు కు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
రెసిడెన్షియల్ విధానంలో 3 నెలలపాటు కొనసాగే ఈ కోర్సులో చేరేందుకు ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బ్యాచ్ కు 30 మంది చొప్పున బ్యాచ్ లను ప్రారంభిస్తున్నట్లు, ఆంధ్ర ప్రదేశ్ లోని 26 జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సౌర రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉండటంతో కేంద్రం ఈ శిక్షణనిస్తోందని, శిక్షణానంతరం ఉత్తీర్ణులైన వారికి స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ సంస్థతో సర్టిఫికెట్లు, ప్రముఖ సోలర్ పరిశ్ర మలలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అదే విధంగా కరెంటు బిల్లు నేడు అందరికి బండెడు భారంగా తయారు అయిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరూ కేవలం 21000/- డౌన్ పేమెంట్ తో 360 యూనిట్ల విద్యుత్ ఉచితం గా పొందవచ్చు అని,
ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది. ఇంటి పై కప్పు పై 3 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకానికి తక్కువ వడ్డీకే బ్యాంక్ ఋణాలు లభిస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆషా సొసైటీ డైరెక్టర్ కరిముల్లా, ఇంచార్జీ మదార్ వలి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.వివరాల కోసం వినుకొండ మార్కాపురం రోడ్ లోని ఆషా సొసైటీ నందు సంప్రదించాలని, మరిన్ని వివరాల కొరకు 76709 85218, 94949 93755 నంబర్లలో సంప్రదించాలని కోరారు. (Story : సౌర రంగంలో మూడు నెలల ఉచిత భోజన వసతితో నిరుద్యోగ యువతకు శిక్షణ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1