సచివాలయాల పనితీరు పై పర్యవేక్షణ
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సచివాలయాలపై పర్యవేక్షణ చెయ్యాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు మునిసిపల్ కమీషనర్ సుబాష్ చంద్రబోస్ సచివాలయం పనితీరును పర్యవేక్షించడానికి మరియు పరిపాలనా ప్రమాణాలకు అనుగుణంగా సచివాలయాలు ఉండేలా తనిఖీ నిర్వహించారు. ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు పబ్లిక్ సర్వీస్ రికార్డ్‌లతో సహా వివిధ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఉత్పాదకత మరియు సేవా బట్వాడా అవస్థాపన అంశాలను కార్యాలయ పరిస్థితులను పౌర సేవలు పబ్లిక్ ఫిర్యాదుల పరిష్కార విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలని సమర్థవంతమైన ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్‌లను అమలు చేయాలని, పౌర సేవా సమయపాలన మరియు కార్యాలయ పని వేళలను పాటించాలని సెలవిచ్చారు. పౌరులతో స్నేహపూర్వక విధానాలు పెంపొందించుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించే అన్ని ప్రమాణాలలో వినుకొండ మున్సిపాలిటీ ముందుండాలని ఆదేశించారు. (Story : సచివాలయాల పనితీరు పై పర్యవేక్షణ)