UA-35385725-1 UA-35385725-1

ఉన్నతాధికారుల పైనే పెచ్చరిల్లుతున్న కులవివక్షత..!

ఉన్నతాధికారుల పైనే పెచ్చరిల్లుతున్న కులవివక్షత..!

అడవి భూముల పాస్ బుక్ ల  కోసమేనా నిరంతరం టార్చర్.. టార్చర్

న్యూస్ తెలుగు/చాట్రాయి : అధికారం…. అగ్రవర్ణాల ….పెత్తందారీ పోకడలు … అహంకారంతో …మంత్రిపేరు అడ్డు పెట్టుకుని వివిధ శాఖల అధికారులపై వివక్షతతో…. పరుష పదజాలంతో … బూతులు తిట్టడం పరిపాటిగా మారిన ఓ వ్యక్తి ఫారెస్ట్ భూములకు పాస్ బుక్ ల కోసం …..పట్టాల కోసం చివరకు మండల రెవిన్యూ అధికారికి కూడా రాత్రి 11:30 తర్వాత ఫోన్లు చేయడం బెదిరించడం పరిపాటిగా మారిందని చాట్రాయి మండలంలో పెద్ద ఎత్తున గుసగుసలు వినవస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే … చెప్పిన కాడ సంతకాలు పెట్టకపోతే చాట్రాయి లో ఉండనివ్వమని యుద్ధం మొదలైందని బాహాటంగానే చెప్పినట్లు తెలుస్తోంది.75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కుల వివక్షత ఇంకా వివిధ రూపాలలో ఉందని చెప్పడానికి ఈ ఉదంతమే అద్దం పడుతుందని పలువురు అంటున్నారు. పూర్వం రోజులలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుల వివక్షత పై ప్రజాసంఘాల పోరాటంతో వివక్షత రూపాలను తెలుసుకోవడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయడం జరిగింది. అనేక చట్టాలను కూడా చేయడం జరిగింది. కానీ నేడు నూజివీడు నియోజకవర్గంలో అత్యధిక మంది బలహీన వర్గాల ప్రజలు ఉన్నారన్న దానితో చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధతో గత మూడు దఫాల నుంచి బలహీన వర్గాలకే అసెంబ్లీ సీటు కేటాయించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం బలహీన వర్గాలకు చెందిన పార్థసారథి గెలుపొందటమే కాకుండా మంత్రి స్థానాన్ని కూడా దక్కించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ బీసీ ఎస్టీలకు పెద్ద పాలేరులో పనిచేస్తానని అనేక సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ అదే సందర్భంలో చాట్రాయి మండలంలో ఇంటిలో ఏమాత్రం ప్రాధాన్యత లేని షాడోలు ప్రాముఖ్యత ప్రాధాన్యత ఈ కాలంలోనే పెరిగిందని పలువురు అంటున్నారు.

 

ఎస్సీ బీసీ ఎస్టీ సామాజిక తరగతులకు చెందిన ఉద్యోగ వర్గాల వారిని మంత్రిగారి పేరుతో పెత్తనం ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అనేక సందర్భాల్లో బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వైసిపి పాలనా కాలంలో చీపురుగూడెం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 645/8లో షుమారు 13 ఎకరాల అటవీ భూమిలో ఒక వ్యక్తి ఆధునిక కోళ్ల ఫారం నిర్మించడంతో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు అడ్డు తిరిగి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తో పాటు 22 శాఖల అధికారులు ఆ భూమిని పరిశీలన చేశారు. సరైన ఆధారాలు లేవని అప్పట్లోనే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ చాట్రాయి తహసిల్దార్ గా విశ్వనాథరావు ఉన్న కాలంలో ‌ మండల ప్రముఖ వైసీపీ నాయకుడిని మధ్యవర్తిగా పెట్టి ఎకరాకు లక్ష రూపాయలు పైగా సుమారు పది లక్షల రూపాయల వరకు ముట్టజెప్పి ఏ విధమైన ఆధారాలు లేని భూమికి పాస్బుక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వేలో కూడా అటవీ భూమి అని అప్పుడు తాసిల్దార్ గా ఉన్న ఆలీ ఒప్పుకుంటూ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అటువంటి భూమికి రి కార్డులను తారుమారు చేస్తూ నమోదు చేయడం లేదని అగ్రవర్ణానికి చెందిన సదరు వ్యక్తి తాసిల్దారు పైన కక్ష కట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలో ఏడున్నర ఎకరాల అడవి భూమికి పాత రికార్డులను చించి వేసి కొత్త రికార్డులు తయారుచేసి పాసుబుక్కులు ఇవ్వాలనేది మరో వ్యక్తి డిమాండ్ సోమవారం లో బంజర భూములు పాసుబుక్కులు ఇవ్వాలని మరొకరు. కొంతమంది కలిసి తాసిల్దారు పైన ప్రతినిత్యం లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ ఒక పథకం ప్రకారం చాట్రాయి మండలంలో ప్రచారం జరుగుతుందని పలువురు అంటున్నారు. మండల కేంద్రమైన చాట్రాయిలో ఒక రైతుకు భూమి సర్టిఫికెట్ అర్జీ పెట్టుకున్న రోజు సాయంత్రమే ఇచ్చినప్పటికీ తాసిల్దారు మాకు పనులు చేయడం లేదని లంచాలు అడుగుతున్నారని స్వయంగా మంత్రికి ఫిర్యాదు చేయడం గమనార్హం. పని చేసిన తర్వాత కూడా చేయలేదు అని ఫిర్యాదు చేయడం చూస్తే ఎవరికైనా విడ్డూరంగా అనిపించక మానదు.
లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు…!
తహసీల్దార్ ప్రశాంతి
తాసిల్దార్ ప్రశాంతిని వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ.తాను నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నానని అర్జీ పెట్టిన రోజే పని పూర్తి చేసినప్పటికీ కొంతమంది పథకం ప్రకారమే కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని తమ పట్ల వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (Story : ఉన్నతాధికారుల పైనే పెచ్చరిల్లుతున్న కులవివక్షత..!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1