వైభవంగా పైడిమాంబ తెప్పోత్సవం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా మంగళవారం సాయంత్రం వనంగుడి లో అమ్మవారి కి స్నానం, అభిషేకం, ప్రత్యేక అలంకరణలుచేసారు.అనంతంరం దేవస ఇఓ డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో అమ్మవారి ని మంగళవాయిద్యాలు తో పెద్దచెరువు వద్దకు పల్లకిపైఊరేగింపుచేసారు.అనంతరంహంసవాహనంపై అమ్మవారికి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈకార్యక్రమాలనుచెరువు పడమటి గట్టు, ఉత్తర గట్టునుండి భక్తులు హంస వాహనంపై కొలువైన అమ్మవారిని దర్శించుకుని జైపైడిమాంబ అంటూజయనాదాలు చేసి నమస్కరించుకున్నారు.ఈకార్యక్రమాలలో ఫైర్ శాఖ, పోలీసు, పురపాలక శాఖ, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : వైభవంగా పైడిమాంబ తెప్పోత్సవం)