కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, డిడబ్లు ఓ ఇంచార్జి శిరీష, డిపిఆర్ఓ రఫిక్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మహేష్ బాబు తదితరులు వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. (Story : కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు)