స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన జాబ్ మేళా
న్యూస్‌తెలుగు/ వినుకొండ : డిపార్ట్మెంట్ ఆఫ్ స్కీల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద(అప్స్సడీసీ), ఎంప్లాయిమెంట్ ఎక్స్చేజ్ మరియు అధ్వర్యంలో జాబ్ మేళను నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఇ. తమ్మాజి రావు మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు జి.వి.ఆంజినయులు ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన , జి ఎస్ కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, వినుకొండ, పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ ను వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళా లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా కోరారు. ఈ జాబ్ మేళాకు సుమారు 4 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఉదాహరణకు శ్రీ దత్త హాస్పిటల్, మాస్టర్ మైండ్స్, ఐలా అగ్రి సర్వీసెస్ మరియు సింధుజ మైక్రో క్రెడిట్స్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలిపారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు 12000 – 35,000 రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు.
ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటిజఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-40 సం||ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.
ఉదయం 9:00 నుండి సాయంత్రం 04:00 వరకు ఇంటర్వూలు జరుగును. జీఎస్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, వినుకొండ, పల్నాడు జిల్లా.
సంప్రదించవలసిన నంబర్లు: డి. జానీ బాషా : 9951214919 , జె. సురేష్ :9100566581,
ఔత్సాహిక యువతి యువకులు ముందుగా https://skilluniverse.apssdc.in/ అనే వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరములకు పైన తెలిపిన నంబర్లను సంప్రదించగలరు. గమనిక: రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనటువంటి యువతీ యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని గమనించగలరు. (Story : స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన జాబ్ మేళా)