UA-35385725-1 UA-35385725-1

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పేరుతో ఫేక్ మెసేజ్ లు

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పేరుతో ఫేక్ మెసేజ్ లు

మోసపూరితమైన మెసేజ్ లను నమ్మొద్దు. రెస్పాండ్ కావద్దు. వెంటనే మెసేజ్ బ్లాక్ చేయండి : కలెక్టర్ దివాకర టి. ఎస్

న్యూస్ తెలుగు /ములుగు : ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ దివాకర టి.ఎస్. పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు.
కలెక్టర్ దివాకర టి. ఎస్.
మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ
+998886747021
ఉజ్బెకిస్తాన్ నంబర్‌ నుంచి ఆ సందేశం పంపిన సబైర్‌ నేరగాడు డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్‌ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు.
దీన్ని గ‌మ‌నించిన క‌లెక్ట‌ర్ దివాకర టి.ఎస్. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న అస‌లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అంద‌రిని అప్ర‌మ‌త్తం చేశారు. త‌న పేరుతో ఎవ‌రూ డ‌బ్బులు అడిగిన ఇవ్వొద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.
పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వకండి, వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రతి ఒక్కరినీ కోరారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించేందుకు సిద్ధమయ్యారు. (Story :ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పేరుతో ఫేక్ మెసేజ్ లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1