మృతి చెందిన మున్సిపల్ వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి
మున్సిపల్ వర్కర్ యూనియన్ సంఘం నాయకులు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మున్సిపాలిటీలో ఎన్ఎంఆర్ వర్కర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగేంద్ర ఆకస్వికంగా మృతి చెందడం జరిగిందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వము, మున్సిపల్ అధికారులు ఆదుకోవాలని మున్సిపల్ వర్కర్ యూనియన్ సంఘం నాయకులు బాబు, సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ తెలిపారు. అనంతరం వారు మృతి చెందిన కుటుంబానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మృతి చెందిన నాగేంద్ర ఎన్ఎంఆర్ వర్కర్ గా పని చేస్తూ అనుకోకుండా అనారోగ్యానికి గురి అయ్యి కర్నూలు ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందని తెలిపారు. మృతి చెందిన నాగేంద్రకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని పెద్దదిక్కు చనిపోవడంతో వారి కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులకు గురికాకుండా మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు మున్సిపల్ అధికారులు ఆదుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు లక్ష్మీ ఓబులేసు, చెన్నకేశవ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. (Story : మృతి చెందిన మున్సిపల్ వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలి)