Home వార్తలు ఐటీసీ ‘కార్టే లూమినా కాపియర్’ ఆవిష్కరణ

ఐటీసీ ‘కార్టే లూమినా కాపియర్’ ఆవిష్కరణ

0

‘కార్టే లూమినా కాపియర్’ ఆవిష్కరణతో కాపియర్ పేపర్ విభాగంలో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచిన ఐటీసీ

హైదరాబాద్, నవంబరు 12: ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ విభాగం (ఐటీసీ పీఎస్‌పీడీ), ఈ విభాగంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగిన ‘కార్టే లూమినా కాపియర్’ను విడుదల చేయడం ద్వారా కాపియర్ పేపర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇప్పటికే పేపర్‌బోర్డ్స్ విభాగంలో సుస్థిర గుర్తింపు పొందిన ‘కార్టే లూమినా’ బ్రాండ్‌ను, ఐటీసీ పీఎస్‌పీడీ ప్రస్తుత కాపియర్ పేపర్ శ్రేణికి జతచేస్తూ రెండు ప్రీమియం వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది: 75 జీఎస్‌ఎమ్ లో కార్టే లూమినా రీగల్, 70 జీఎస్‌ఎమ్ లో కార్టే లూమినా బ్లూ.

విస్తృతమైన పరిశోధన, ఉత్పత్తి ఇంజనీరింగ్ ద్వారా రూపొందించబడిన ఈ శ్రేణి పేపర్లు 95 (C/20) కంటే ఎక్కువ ఐఎస్‌ఓ బ్రైట్‌నెస్, 160(D65/100) కంటే ఎక్కువ సీఐఈ వైట్‌నెస్ కలిగి ఉన్నాయి.అంతేకాకుండా, అత్యుత్తమ షీట్ పనితీరు కోసం అధిక దృఢత్వాన్ని అందిస్తాయి. అద్భుతమైన ప్రింట్ నాణ్యత,స్థిరత్వం మరియు ఎటువంటి ఆటంకాలు లేని నమ్మకమైన ప్రింటింగ్ అనుభవాన్ని అందించేలా వీటిని తీర్చిదిద్దారు.

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఛాంపియన్ పి.వి. సింధు ప్రచారకర్తగా రూపొందించిన విస్తృత ప్రచార కార్యక్రమం ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణకు మరింత ఊతమిస్తోంది. అత్యుత్తమ ప్రతిభను కనబరచాలనే ఆమె నిరంతర అన్వేషణ, తన ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగే ఆమె అంకితభావం.. “ఛాంపియన్ల కోసం రూపొందించినది. ఒక ఛాంపియన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్నది” అనే ఈ వినూత్న ఉత్పత్తి మౌలిక తత్వానికి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి.

ఈ ఆవిష్కరణ సందర్భంగా ఐటీసీ లిమిటెడ్ పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ రాజేష్ పొన్నూరు మాట్లాడుతూ.. “ఉత్పత్తి పనితీరులో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పేలా రూపొందించిన అత్యుత్తమ నాణ్యత గల కార్టే లూమినా కాపియర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, ఈ విభాగంపై మాకున్న నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాము. లోతైన సాంకేతిక నైపుణ్యం, ఆధునిక తయారీ విధానాలు మరియు నాణ్యతపై నిరంతర దృష్టిని మేళవించి, వినియోగదారులకు అత్యుత్తమ విలువను, మెరుగైన ప్రింటింగ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. కార్టే లూమినా కాపియర్ పేపర్‌కు నిర్వచనమైన అత్యుత్తమ ప్రతిభ, నిరంతర అభివృద్ధి అనే స్ఫూర్తిని పి.వి. సింధుతో మా భాగస్వామ్యం శక్తివంతంగా ప్రతిబింబిస్తోంది” అని పేర్కొన్నారు.

కార్టే లూమినా కాపియర్‌ను తొలుత హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో విడుదల చేస్తున్నారు. అత్యుత్తమ నాణ్యత,బలమైన వినియోగదారు సంబంధాలు మరియు నిరంతర ఆవిష్కరణల ద్వారా కాపియర్ పేపర్ విభాగంలో తన ఉనికిని మరింత విస్తరించుకోవాలనే ఐటీసీ పీఎస్‌పీడీ లక్ష్యంలో ఈ ఆవిష్కరణ ఒక కీలక ముందడుగు. (Story: ఐటీసీ ‘కార్టే లూమినా కాపియర్’ ఆవిష్కరణ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version