ఐకేఎస్ హెల్త్ ఆర్థిక ఫలితాలు విడుదల
ముంబై: అమెరికా ఆరోగ్య సంరక్షణ రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను, ‘కేర్ ఎనేబుల్‌మెంట్’ ప్లాట్‌ఫారమ్‌ను అందించే ప్రముఖ సంస్థ ‘ఇన్వెంటురస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ లిమిటెడ్స్ (ఐకేఎస్), సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2 ఎఫ్‌వై27) సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. తమ ‘కేర్ ఎనేబుల్‌మెంట్’ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొనసాగుతున్న బలమైన వృద్ధితో పాటు, ట్రూబ్రిడ్జ్ సంస్థను విజయవంతంగా విలీనం చేసుకోవడం (82 రోజుల కాలంలో) ద్వారా, కంపెనీ ఆదాయం, ఈబీఐటీడీఏలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. క్యూ2 ఎఫ్‌వై27 రెండో త్రైమాసికంలో రూ.15,925 మిలియన్ల ఆదాయం లభించింది. వార్షిక ప్రాతిపదికన (వైఓవై) 103.9%, త్రైమాసిక ప్రాతిపదికన (క్యూఓక్యూ) 78.2% (భారత రూపాయిలలో), అమెరికన్ డాలర్లలో వార్షిక వృద్ధి 87.3% పొందింది. ఈబీఐటీడీఏ వార్షిక ప్రాతిపదికన 62.5%, త్రైమాసిక ప్రాతిపదికన 49.7% వృద్ధిని సూచించింది. ఇక ప్యాట్ (పన్ను తర్వాత లాభం) చూస్తే, వార్షిక ప్రాతిపదికన 20.4%, త్రైమాసిక ప్రాతిపదికన 12.4% వృద్ధి దక్కింది. ఈబీఐటీడీఏ మార్జిన్ 27.7%, ప్యాట్ (పీఏటీ) మార్జిన్ 13.7% కన్పించింది. ట్రూబ్రిడ్జ్ కొనుగోలు, క్యూ2 ఎఫ్‌వై27 నుండే ప్యాట్, ఈపీఎస్ (ప్రతి షేరుకు ఆదాయం) వృద్ధికి దోహదపడింది. 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, ఐకేఎస్ హెల్త్, ట్రూబ్రిడ్జ్ సంయుక్త బలాలను కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా ఐకేఎస్ హెల్త్ ఒక కీలకమైన మలుపుకు చేరుకుందని ఐకేఎస్ హెల్త్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ సీఈవో సచిన్ కె. గుప్తా అన్నారు. (Story: ఐకేఎస్ హెల్త్ ఆర్థిక ఫలితాలు విడుదల)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
