వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
సాలూరు పెద్దగడ్డను సందర్శించిన జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి
వర్షాల పరిస్థితులను పరిశీలించి అధికారులకు సూచనలు

న్యూస్ తెలుగు/సాలూరు: జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సాలూరు పెద్దగడ్డను సందర్శించి అక్కడి వరద నీటి పరిస్థితులను పరిశీలించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు వరద నీరు ప్రవహించే ప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో పాలకొండ సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత రహార్, సాలూరు తహసీల్దార్, ఎంపిడిఓ, రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, సచివాలయ సిబ్బంది ఉన్నారు. (Story: అధికారులు అప్రమత్తంగా ఉండాలి)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!