Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌తుపాన్‌పై రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

తుపాన్‌పై రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

తుపాన్‌పై రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
వ్యవసాయ అధికారి కే.శిరీష

న్యూస్ తెలుగు/సాలూరు: అర్నాబ్’ తుఫాను నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకొని వ్యవసాయ పంటలను కాపాడుకోవాలని సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష తెలిపారు. సోమవారం సాలూరు మండలం ఖరసువలస, గుర్రపువలస ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కావున రైతులు అందరూ అప్రమతంగా ఉండి, తమ పంటలను కాపాడుకోవడానికి ఈ క్రింది వ్యవసాయ సూచనలు పాటించవలసిందిగా కోరడమైనదని తెలియజేశారు. పొలంలో అదనంగా ఉన్న నీరు నిల్వ ఉండకుండా, నీరు బయటకు పోయేలా మురుగు కాలువలు (డ్రైనేజీ ఛానెల్స్) ఏర్పాటు చేసుకోవాలనీ తెలిపారు.ఎరువులు, పురుగు మందుల పిచికారీని తాత్కాలికంగా ఆపివేయాలి చెప్పారు. మొక్కజొన్న పంట విష‌యంలో పంటలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసి నీటిని బయటకు పంపాలని అన్నారు. కోత దశలో ఉన్న మొక్కజొన్న కంకులను వెంటనే కోసి, సురక్షితమైన ప్రదేశంలో నిల్వ చేసుకోవాలనీ అన్నారు. పత్తి పంటకు ఎక్కువ నీరు నిలిస్తే వేరుకుళ్లు తెగులు వచ్చి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, పొలంలో నీరు నిలవకుండా మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పగిలిన పత్తి కాయల నుండి పత్తిని (పత్తి పత్తిని) వెంటనే ఏరుకోవాలనీ అన్నారు. వర్షానికి తడిస్తే పత్తి రంగు మారిపోయి నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్లో సరైన ధర రాదు.కాబట్టి ముందుగానే ఏరుకుని భద్రపరుచుకోవాలనీ అన్నారు ఏరిన పత్తిని వర్షానికి తడవకుండా సురక్షితమైన, గాలి ఆడే పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. రైతు సోదరులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించి పంట నష్టాలను నివారించవలసిందిగా తెలిపారు, ఈ కార్యక్రమంలోని రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. (Story: తుపాన్‌పై రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి)

Top Stories You Can See

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments