ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు!
న్యూస్తెలుగు/చింతూరు: పోలవరం జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని చింతూరు పోలీస్ స్టేషన్లో పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి ఎదుట ముగ్గురు ఏసీఎం (ఏరియా కమిటీ మెంబర్) స్థాయి మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మాడవి కోయింగ్ ఎలియాస్ రజని – ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు. హేమల హెడ్మా ఎలియాస్ దీపక్ – ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు. కొవ్వాసి జోగి ఎలియాస్ గంగి – ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గజరాజు పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, లొంగిపోయిన ఈ ముగ్గురు మావోయిస్టులు 2013, 2014, 2017 సంవత్సరాల్లో జరిగిన మఠం ఫారెస్ట్, సబ్ ప్లాట్, వంగమెల్లి ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు. వీరు కళాజాతరల నిర్వహణతో పాటు తుపాకీ తూటాల అసెంబ్లింగ్లో నైపుణ్యం కలిగి ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు మావోయిస్టు సిద్ధాంతాలపై విసుగు చెంది జనజీవన స్రవంతిలోకి కలిసామన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలు, ఆచరణలో ఉన్న వ్యత్యాసాలు, కుల వివక్ష, ఎక్కువ కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ఆదరణ తగ్గడం, పోలీసుల గస్తీ పెరగడం వల్ల ప్రాణహాని ఉంటుందనే భయంతో తాము స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, లొంగిపోయిన వారికి ప్రభుత్వ పథకాలు, పునరావాస ప్రయోజనాలు కల్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, మాట్లాడుతూ, మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి, ఎవరిప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందించే పునరావాస ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఓఎస్డీ అడ్మిన్ జావలి, చింతూరు సిఆర్పిఎఫ్ ఏకే దీప టువైసీ, చింతూరు డిఎస్పి ఉదయ పావని, సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ సంతోష్ కుమార్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story: ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు!)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

