వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు….
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండలో అదనపు కోర్టు మంజూరుకు విశేషంగా కృషి చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులుకు వినుకొండ బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను కలవడం ద్వారానే ఈ కోర్టును త్వరితగతిన సాధించామన్నారు. కోర్టు మంజూరుకు సహకరించిన హైకోర్టు, జిల్లా, స్థానిక న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.వి. రమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ నీలం శేఖర్ బాబు, ట్రెజరర్ వి. శివశంకర్ బాబు, ప్రస్తుత ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వర్ రావుతో పాటు పొట్లూరి సైదారావు, యలవర్తి శ్రీనివాసరావు, షేక్ సిద్దయ్య తదితర సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.(Story : వినుకొండకు అదనపు కోర్టు: సీఎం, ఎమ్మెల్యే కు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు…. )

