Home వార్తలు దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ

దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ

0

దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ

శివశక్తి ఆధ్వర్యంలో 20 ట్రై సైకిల్ పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు/వనపర్తి  : దివ్యాంగులకు చేయూతగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని తన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని 20 మంది దివ్యాంగులకు శివ శక్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్రై సైకిల్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని జీవీ పేర్కొన్నారు. “దివ్యాంగ శక్తి” పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 207 కోట్ల సబ్సిడీ భారం భరిస్తోందని జీవీ తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రూ. 3,000గా ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 6,000కు పెంచినట్లు గుర్తు చేశారు. దివ్యాంగులకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. రూ. 40 వేల విలువ చేసే బ్యాటరీ ట్రైసికిళ్లను పంపిణీ చేశామని తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ దివ్యాంగులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఫౌండేషన్ నుండి పంపిణీ చేసిన బ్యాటరీ ట్రై సైకిల్ ను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ ట్రైసికిళ్లు సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని వివరించారు. జీడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. గత 25 ఏళ్లుగా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కంటి ఆపరేషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో జీవి ఆంజనేయులుని నియోజకవర్గ ప్రజలు మూడుమార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని, తద్వారా పార్టీ అధిష్టానం జీవికి చీఫ్ విప్ పదవి ఇచ్చిన నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధిలో మరింత ముందుకు సాగుతున్నారని మక్కెన కొనియాడారు. ఈ నేపథ్యంలోనే వినుకొండ పైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు, శాశ్వత త్రాగునీటి పథకం పనులు, ఎన్ఎస్పి స్థలంలో పలు ప్రజా ప్రయోజన కరమైన అభివృద్ధి పనులు, త్వరిత గతిన పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు, కూటమి నేతలు నిశ్శంకర శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, పివి సురేష్ బాబు, బొంకూరి రోశయ్య, హనుమ నాయక్, గుంజి కాళింగరాజు, దాసరి కోటేశ్వరరావు, ముండ్రు సుబ్బారావు, అంజి పాల్గొనగా శివశక్తి మేనేజర్ ఫణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.(Story : దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version