Home వార్తలు తెలంగాణ కాంగ్రెస్ లో చేరిన పాతపల్లి BRS పార్టీ వార్డు సభ్యులు

కాంగ్రెస్ లో చేరిన పాతపల్లి BRS పార్టీ వార్డు సభ్యులు

0

కాంగ్రెస్ లో చేరిన పాతపల్లి BRS పార్టీ వార్డు సభ్యులు

న్యూస్ తెలుగు/వనపర్తి  : కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన
MLA మేఘారెడ్డి

పెబ్బేరు మండలం పాత పల్లి గ్రామానికి చెందిన 2వ వార్డు సభ్యురాలు కవిత, 4వ వార్డ్ సభ్యురాలు ఉషనమ్మగారు శనివారం మాజీ సర్పంచ్ పి రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో BRS పార్టీ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు

వీరికి వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు వనపర్తి లోనీ నంది హిల్స్ లో గల తన నివాస కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ పథకాలకు పాలనకు ఆకర్షితులమై నేడు BRS పార్టీ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు

పేరుతో పాటు మరో 25 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగిస్తుందని నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన నిరుపేదలకు అందుతున్నాయన్నారు

కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించవచ్చునని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బలోపేతంకి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు విలేజ్ ముత్త రాములు పాతపల్లి రవీందర్, వెంకటయ్య శ్రీరాములు
చిరంజీవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.(Story : కాంగ్రెస్ లో చేరిన పాతపల్లి BRS పార్టీ వార్డు సభ్యులు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version