Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

దివ్యాంగుల గౌరవాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించింది. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన “దివ్యాంగ శక్తి” కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గ్యారేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, ఇప్పటివరకు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నదని తెలిపారు. ఉగాది కానుకగా ప్రారంభమైన ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగలుగుతారని ఆంజనేయులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ప్రయాణానికి రూ. 207 కోట్ల సబ్సిడీ భారం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 రూపాయలుగా ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 6,000కు పెంచడం, పూర్తిస్థాయి వైకల్యంతో బాధపడుతున్నవారికి నెలకు రూ. 15,000 పెన్షన్ అందించడం గొప్ప విషయం అన్నారు. వైద్య సేవలు, ఉద్యోగాలు, ఇతర అవసరాల కోసం సులభం గా, ఉచితంగా రాకపోకలు కల్పించడం వంటి చర్యలు దివ్యాంగుల స్వావలంబనకు పెద్ద మద్దతు అందిస్తాయని జీవి స్పష్టం చేశారు.ఈ నిర్ణయాలు దివ్యాంగుల కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు. అనంతరం జీవి ఆంజనేయులు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, వారి సమస్యలు, అభిప్రాయాలు విన్నారు. విభిన్న ప్రతిభావంతులు తమ అభిప్రాయాలను జీవి తో పంచుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం వద్ద దివ్యాంగులు తమకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు బొంకూరి రోశయ్య, పత్తి పూర్ణ, హనుమాన్ నాయక్, సౌదాగర్ జానీ, ఆర్టీసీ అధికారులు ఏవో ఎం వెంకటేశ్వరరావు, ఇన్చార్జి డిఎం ధనలక్ష్మి, యూనియన్ నాయకులు పి సాంబశివరావు, ఎస్కే కాజా, రమేష్, ఆర్టీసీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.(Story : దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!