Home వార్తలు తెలంగాణ పాండేశ్వర్ రెడ్డి గారి అకాల మరణం దురదృష్టకరం

పాండేశ్వర్ రెడ్డి గారి అకాల మరణం దురదృష్టకరం

0

పాండేశ్వర్ రెడ్డి గారి అకాల మరణం దురదృష్టకరం

కాంటినెంటల్ హాస్పిటల్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి గారి భర్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండేశ్వరి రెడ్డి గారు మృతి చెందడం దురదృష్టకరమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11:30 గంటలకు మృతి చెందడం విషాదకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని కుమారుడు యుగంధర్ రెడ్డి తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు
ఈ పరామర్శలో ఖిల్లా ఘణపురం మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, రంగాపురం రామచంద్రారెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు.(Story : పాండేశ్వర్ రెడ్డి గారి అకాల మరణం దురదృష్టకరం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version