వినుకొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమరజీవికి ఘన నివాళులు
న్యూస్ తెలుగు/వినుకొండ : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో. శ్రీరాములు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబడిందని గుర్తుచేశారు. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటమే ప్రధాన కారణభూతమైందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.(Story : వినుకొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమరజీవికి ఘన నివాళులు)
