Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

వినుకొండలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

0

వినుకొండలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : పల్నాడు జిల్లా వినుకొండలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లిఖార్జునరావు ఆదేశాల మేరకు.. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు కలిసి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన త్యాగమే స్ఫూర్తి తెలుగువారిపై అప్పటి తమిళుల నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్ష, ప్రాణత్యాగం ఫలితంగానే నేడు మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వక్తలు గుర్తు చేశారు. తన మరణం అనంతరం కూడా తన ఆత్మ తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతుందని నాడు ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఆయన సేవలకు గుర్తింపుగా 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో 6.8 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వనాన్ని, 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథం, జిల్లా చీఫ్ ఆర్గనైజర్ మోటమర్రి వెంకట నరసింహారావు, యువజన సంఘం నాయకులు పువ్వాడ కృష్ణ, ఉపాధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి శనిశెట్టి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు చీతురాల శరత్, ఆర్యవైశ్య సంఘం నాయకులు అన్నా మల్లికార్జునరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, అచ్యుత కోటేశ్వరరావు, రెడ్డి వెంకటరత్నం, పెరుమాళ్ళ అమర్నాథ్, అప్పలరాజు, మండవ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version