ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ఎన్ఎస్పీ కాలనీలోని జెడ్పీ హైస్కూల్ క్రీడాకారులకు గురువారం క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వినుకొండ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త యోండ్లూరి సత్యనారాయణ సుమారు రూ. 30 వేల విలువచేసే 60 జతల క్రీడా దుస్తులను విద్యార్థులకు బహుకరించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్, రూరల్ సీఐ బ్రహ్మయ్య, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దాత సత్యనారాయణ మాట్లాడుతూ.. తన మిత్రుడు, పాఠశాల పీడీ రాధాకృష్ణమూర్తి దృష్టికి తీసుకురావడంతో ఈ దుస్తులు అందజేశానని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని దేహదారుఢ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా మానసికంగా దృఢంగా ఉండి చదువుల్లోనూ రాణిస్తారని అన్నారు. విద్యార్థులు రోజూ గంటసేపు మైదానంలో ఆడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, క్రీడా మైదానాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని సీఐలు ప్రభాకర్, బ్రహ్మయ్య ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. వీరప్పయ్య మాట్లాడుతూ.. నూతనంగా అప్గ్రేడ్ అయిన తమ పాఠశాలలో మౌలిక వసతుల లేమిని దాతల దృష్టికి తీసుకెళ్లగానే వారు స్పందించి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. క్రీడా దుస్తులు అందించిన సత్యనారాయణకు పాఠశాల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ ఆర్. రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ )

