Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలకు దాతల సహకారం మరువలేనిది

పాఠశాలకు దాతల సహకారం మరువలేనిది

0

పాఠశాలకు దాతల సహకారం మరువలేనిది

న్యూస్ తెలుగు/వినుకొండ  : పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషి, దాతల సహకారంతో ఎన్ఎస్పి కాలనీ లోని జడ్పీ హైస్కూల్ పాఠశాల నందు నూతనంగా స్టేజ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. పట్టణంలో నూతనంగా ఉన్నతీకరించిన పాఠశాలలో మౌలిక సదుపాయాలలో భాగంగా ప్రతిరోజు పాఠశాలలో అసెంబ్లీ నిర్వహణకు మరియు పాఠశాల వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి వేదిక అవసరం ఉందని గ్రహించి దాతల సహకారంతో సుమారు 1,20,000 రూపాయలు విలువచేసే స్టేజిను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ స్టేజి నిర్మాణంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆర్.రాధాకృష్ణమూర్తి దాతలను సమన్వయపరిచి స్టేజి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. స్టేజి నిర్మాణంకు పాఠశాల పూర్వ విద్యార్థి ఎం విజయభాస్కర్ సిమెంట్ కట్టలను అందించారు. శానంపూడి గ్రామానికి చెందిన ఆకుమల్ల సుభాని ఖాసింబి లు ఉచితంగా కట్టుబడి చేసి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. చిరుమామిళ్ల కోటేశ్వరరావు బ్రిక్స్ రాళ్లను అందించారు,ఎండ్లూరి శ్రీకాంత్ కంకరను, వెంకటరావు ఇసుకను సమకూర్చారు. వీటితోపాటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఎన్ పద్మజా మరియు మిగిలిన పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించారు. నూతనంగా ఏర్పాటైన ఈ పాఠశాలకు గతంలో కూడా దాతల సహాయ సహకారాలతో పాఠశాలకు అవసరమైన ప్రధాన గేటును, విద్యార్థులకు త్రాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ ను, పాఠశాలకు అవసరమైన మైకు, కంప్యూటర్ ప్రింటర్, కుర్చీలను , మరియు బీరువాల ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దాతలకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు. ఇటీవల పాఠశాలలో మొదటిసారిగా ఎన్.ఎం.ఎం.ఎస్ ప్రవేశ పరీక్షలో పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు తెలిపారు .అదేవిధంగా వివిధ సైన్స్ ప్రదర్శనా పోటీల్లో ఈ పాఠశాల నుండి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం పాఠశాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు ఎలీషా, రాంబాబు, రాధాకృష్ణమూర్తి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.(Story : పాఠశాలకు దాతల సహకారం మరువలేనిది )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version