పార్టీ కోసం పనిచేసే వారందరికీ పదవులు తప్పనిసరి
న్యూస్ తెలుగు/వనపర్తి : పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పదవి బాధ్యతలో ఉంటారని ఎవరు ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకూడదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గార్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ మండల కమిటీల ఏర్పాటుతో భాగంగా బుధవారం రేవల్లి, ఏదుల గోపాల్పేట్ మండలాలలో నిర్వహించిన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారుల్లోకి వచ్చాక పునపర్తి నియోజకవర్గానికి రెండు నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులను మంజూరు చేసిందని, అదేవిధంగా 7 సింగిల్ విండో సంఘాలను సైతం మంజూరు చేసిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారితో పాటు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా నూతన మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లో గ్రామ అధ్యక్షుడి పదవికి అధిక ప్రాముఖ్యత ఉంటుందని గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ అధ్యక్షులను ఫలితం నూతనంగా నియమిస్తున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అండా నా ఉంటూ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పదవులు తప్పకుండా దక్కుతాయని, కొందరికి పార్టీ పదవులు దక్కితే మరికొందరికి నామినేటెడ్ పదవులు మరికొందరికి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఉపసర్పంచ్ సింగిల్ విండో లాంటి వాటిలలో తప్పకుండా సముచిత స్థానం కల్పించనున్నట్లు వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇండ్లు ఉచిత కరెంటు రేషన్ బియ్యం రేషన్ కార్డులు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం మహిళల సంఘాల భాగస్వామ్యంతో ఆర్టిసి బస్సులు కొనుగోలు, వడ్డీ లేని రుణాలు లాంటి అనేక పథకాలు చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మనం వెనకబడి పోతున్నామని అందుకు తావివ్వకుండా ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని వారు సూచించారు. ఏదుల గ్రామంలో రిజర్వాయర్ నిర్మించారు తప్ప రిజర్వాయర్ నుంచి వనపర్తి నియోజకవర్గంలోని సాగుభూములకు చుక్క నీరు రాకపోవడం దురదృష్టకరమని వారన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో , ఎంపీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, కౌన్సిలర్ల , ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని రానున్న రోజుల్లో సైతం ప్రతిపక్షాలు చేసే ప్రతి పనిని తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని వారు సూచించారు. నూతనంగా ఏర్పాటైన ఏధుల మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడి నియామకం కోసం ఆశావాకుల నుంచి వారు పేర్లను సేకరించారు. త్వరలోనే మండల కమిటీ ని ప్రకటించనున్నట్లు వార్తలు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి వైశాల్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ జర్నల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, OBC జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, ఖిల్లా ఘణపురం మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, చీర్ల జనార్ధన్, న్యాయవాది తిరుపతయ్య, మాజీ జెడ్పిటిసి రాజేందర్ రెడ్డి, గోపాల్పేట మండల యూత్ అధ్యక్షులు యాదగిరి. సుఖేందర్ రెడ్డి, గోపాల్పేట మండల ఎన్ ఎస్ యు ఐ నాయకులు జానకి రాములు, ఆయా గ్రామాల్లో సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : పార్టీ కోసం పనిచేసే వారందరికీ పదవులు తప్పనిసరి )
