ఘనంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవం
న్యూస్ తెలుగు/వినుకొండ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్‌లో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులును ఎన్టీఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పోలవరపు మరియరాజు కలిసి ఆహ్వానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా గౌరవ కలెక్టర్ కృతిక శుక్లా, ప్రముఖ మోటివేటర్, ఐఏఎస్ అకాడమీ అధినేత మల్లవరపు బాలలత హాజరవుతారని రాష్ట్ర ఎన్టిఏ అదనపు కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు.(Story : ఘనంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవం )
