Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

0

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

న్యూస్ తెలుగు/వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం భవన ఆవరణలో అన్నదాన కార్యక్రమం కీ.శే. గంగినేని వీరయ్య జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని కిత్తేరమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం తో పాటు గత నాలుగు సంవత్సరాలుగా వార్షికంగానే కాక, పుట్టినరోజులు, వారి తల్లిదండ్రుల సంస్మరణ దినోత్సవాలు ఈతోదికంగా ఎక్కువసార్లు విరాళాలు వారు అందించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని అవ్వారు కోటేశ్వరరావు, జి నాగేంద్రుడు, పి నారాయణ రావు, శేషయ్య, హనుమంతరావు లకు ఘనంగా సత్కరించి, మోమంటోలు అందజేశారు. అనంతరం వి.ఎల్ సామ్రాజ్యం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, వైవి సుబ్బయ్య శర్మ, ఎం.వి శర్మ, బిపిఎస్. సుందర్రావు, గోపి, ఆది రాములు, వెంకటస్వామి, రాఘవయ్య, రమేష్, కృష్ణ, శామ్యూల్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.(Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version