Homeవార్తలుతెలంగాణమరో 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది

మరో 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది

మరో 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది

న్యూస్ తెలుగు/వనపర్తి : రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు . మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం వనపర్తి పట్టణంలోని 33, 24 వార్డులలో మార్నింగ్ వాక్ చేపట్టి ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి
33 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాధవి SLN రమేష్ గారిని, అదేవిధంగా 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జయమ్మ శ్రీనివాసులు గార్లకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనేనిరుపేదలకు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతూనే ఇప్పటికీ వనపర్తి పట్టణంలో 50 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం, 23 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ విద్యార్థులకు వసతి గృహాల నిర్మాణం రాజభవణ పునరుద్ధరణ గల్లీలలో ఐమాస్ట్ లైట్లు ఏర్పాటుపది సంవత్సరాల పాలనలో మురికి కూపాలుగా మారిన కాలనీలలో డ్రైనేజీల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి కాలనీలను సుందరంగా మార్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఆయన అన్నారు. మరో 8 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని వనపర్తిని అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు యువకులు, మహిళలు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.(Story : మరో 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!