బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిస్తే మరింత అభివృద్ధి
న్యూస్ తెలుగు/వనపర్తి : నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గాంధీచౌక్ నందు 3,4,15,16,17వార్డుల బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులు ఇమ్రాన్,సిరిగిరి.మన్నెం,సుజాత,అయేషా,బాలరాజు తరపున కార్నర్ మీటింగ్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా 24గంటలు నీళ్లు ఇచ్చామని,మురికి కూపంగా ఉన్న నల్లచెరువు,కందకాన్ని వినియోగంలోకి తెచ్చి ఆధునీకరణ చేశామని అన్నారు. పాత పట్టణం అభివృద్ధి చెందాలని ఆర్.టి.ఏ కార్యాలయం,మాత శిశు సంక్షేమ కేంద్రం, క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని మున్సిపల్ ఎన్నికలలో బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా నిలిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు 2500,ఆసరా పింఛన్లు 4000,తులం బంగారం,కె.సి.ఆర్ కిట్టు, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా బకాయిలు చెలించేకే ఓట్లు వేస్తామని కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకునిగా అనేక సార్లు వనపర్తి వచ్చాను ఆరోజు పట్టణ పరిస్థితి ఏమిటి నిరంజన్ రెడ్డి హయాములో అభివృద్ధి అయిన పట్టణ పరిస్థితి ఏమిటో బేరీజు వేసుకొని ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని అన్నారు. రోడ్ల విస్తరణ,మార్కెట్ సముదాయం,మహిళా అగ్రికల్చర్ కళాశాల,జిల్లా ఏర్పాటు, ఐ.టి.టవర్,జె. ఎన్.టి.యు కలశాల వంటి పథకాలు తెచ్చిన ఘనత నిరంజన్ రెడ్డి గారిదని కొనియాడారు. 10ఏండ్లలో అనితర సాధ్యమైన అభివృద్ధి సాధించారని కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ బి.లక్ష్మయ్య,పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,వేణు గోపాల్,గంధం. బాలపీరు, గులాం ఖాదర్ ఖాన్,బొబ్బిలి. ప్రేమ్కు మార్,నీలస్వామి,చిట్యాల.రాముసయ్యద్.జమీల్,సూర్యవంశం.గిరి,జోహెబ్ హుస్సేన్,మంద.రాము తదితరులు ఉన్నారు.(Story : బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిస్తే మరింత అభివృద్ధి )

