కబడ్డీ పోటీ దారులకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్ అందజేత
న్యూస్ తెలుగు /వినుకొండ : ఇటీవల వినుకొండ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 19 కబడ్డీ పోటీల ద్వారా రాష్ట్రం నుండి జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక చేయబడిన పురుషుల మరియు మహిళల జట్ల లోని 28 మంది సభ్యులకు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు 60 వేల రుపాయలు విలువైన స్పోర్ట్స్ డ్రెస్ కిట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ, రోటరీ జోనల్ ప్రముఖులు ఆలా శ్రీనివాసరావు, ఎం.గిరిబాబు , రోటరీ అడ్మినిస్ట్రేటర్ కూచి రామాంజనేయులు , గంగినేని ఫౌండేషన్ చైర్మన్ రాఘవ , స్కూల్ గేమ్స్ డివిజన్ కార్యదర్శి చిరంజీవి, జిల్లా కార్యదర్శి సురేష్, కబడ్డీ టీం లు శిక్షణ పొందుతున్న శంకరభారతిపురం హైస్కూల్ హెచ్ఎం. రమాదేవి, పి ఇ టి పద్మావతి పాల్గొన్నారు. (Story:కబడ్డీ పోటీ దారులకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్ అందజేత)

