రిపబ్లిక్ డే రోజు మాంసాహార విక్రయాలపై నిషేధం
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 సోమవారం వినుకొండ పట్టణం నందు మాంసాహారం నిషేదించడమైనదని మరియు జంతువధశాల మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున మాంసాహార వ్యాపారస్తులు, చికెన్ స్టాల్స్ వారు, చేపల వ్యాపారస్థులు తమ అంగళ్ళు మూసివేయాలని తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్స్ వారు కూడా మాంసాహారం విక్రయం నిలిపి వేయాలన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించు వారి పై చట్టరిత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు.(Story:రిపబ్లిక్ డే రోజు మాంసాహార విక్రయాలపై నిషేధం)

