జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేత
న్యూస్ తెలుగు /వినుకొండ : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు క్రియాశీలక కార్యకర్తల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల గాదె వెంకటేశ్వరరావు ,వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శీను రాయల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త వేలమకన్ని వీరా రాఘవ శర్మ యొక్క చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున 5 లక్షల చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్ ఇల్లా పోలరాజు, గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాల కోటేశ్వరరావు, నడిగడ్డ గ్రామ వైస్ ప్రెసిడెంట్ యర్రబోతుల రామకృష్ణ , వినుకొండ ప్రభుత్వ వైద్యశాల డైరెక్టర్ తుమ్మ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (Story:జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేత)

