పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి
న్యూస్ తెలుగు/వినుకొండ : సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 113 మంది లబ్ధిదారులకు, 59 లక్షలు 86 వేలు చెక్కులను మంగళవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు, తమకు అందేలా కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, జనసేన నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.(Story : పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి )

