యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయంలో మంగళవారం ఎంఎస్ఎంఈ మరియు వివిధ సబ్సిడీ రుణాల లబ్ధిదారులతో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులతో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. ఆర్థికాభివృద్ధ, నిరుద్యోగ యువత మరియు చిన్న తరహా వ్యాపారులు స్వయం శక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగం ద్వారానే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పేదరిక నిర్మూలన మరియు పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ , జనసేన నాయకులు శ్రీనివాసరావు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి )

