Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ వాసులకు అందుబాటులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడిగం శ్రీనివాసరెడ్డి...

వినుకొండ వాసులకు అందుబాటులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడిగం శ్రీనివాసరెడ్డి…

వినుకొండ వాసులకు అందుబాటులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడిగం శ్రీనివాసరెడ్డి…

ప్రతి నెల 3వ మంగళవారం వినుకొండ తిరుమల హాస్పిటల్లో వైద్య సేవలు…

తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి చికిత్స అందించడమే లక్ష్యం….

న్యూస్ తెలుగు/వినుకొండ : హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రముఖ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడిగం శ్రీనివాసరెడ్డి ఇకపై ప్రతి నెల మూడవ మంగళవారం వినుకొండ పట్టణంలోని తిరుమల హాస్పిటల్ నందు రోగులకు అందుబాటులో ఉంటారని, ఈ మేరకు మంగళవారం తిరుమల హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ ప్రాంతానికి చెందిన నూజెండ్ల మండలం, గాంధీనగర్ గ్రామానికి చెందిన వ్యక్తిని అని గుర్తు చేసుకున్నారు. తన సొంత ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల 3వ మంగళవారం ఇక్కడకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా కీళ్ల నొప్పులు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి ఆయన చికిత్స అందించనున్నారు. ముఖ్యంగా:మోకాళ్ల సమస్యలు, భుజం నొప్పులు,నడుము నొప్పి, వెన్నెముక సమస్యలు ఇతర అత్యాధునిక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు. కార్పొరేట్ ఆసుపత్రి అనగానే సామాన్యులు ఖర్చుకు భయపడే పరిస్థితి ఉంది. కానీ యశోద హాస్పిటల్స్ ఆ భయాన్ని పోగొట్టేలా అడుగులు వేస్తోంది. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర ఆసుపత్రుల కంటే అతి తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే వినుకొండ ప్రాంతానికి చెందిన పలువురికి యశోద హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడే వినుకొండ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో పాటు హైదరాబాద్ యశోద హాస్పిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వీరంకి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఎం.తిమోతి, తిరుమల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అప్పిరెడ్డి, హాస్పటల్ సిబ్బంది, పాల్గొన్నారు.(Story : వినుకొండ వాసులకు అందుబాటులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడిగం శ్రీనివాసరెడ్డి… )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments