ఐరాంమూర్తి బ్లాక్ మైలింగ్ ఆరోపణలు మానాలి
బీసీలపై దాడులు చేసిన వైసీపీ.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన టిడిపి….
పార్టీలు మారే ఐరాం మూర్తి వ్యాఖ్యలను ఖండించిన శావల్యాపురం టిడిపి నాయకులు….
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం కు చెందిన వైసిపి నాయకుడు ఐరాంమూర్తి టిడిపి మండల నాయకులపై చేసిన నిరాధారణమైన ఆరోపణను శావల్యాపురం టిడిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో శావల్యాపురం మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, సొసైటీ అధ్యక్షులు గడిపూడి విశ్వనాథం, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. తాను బీసీ నాయకుడినని, టిడిపి నాయకులు నన్ను బెదిరించారని అసత్య ఆరోపణ చేయటం సరి కాదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో శావల్యాపురం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను వార్డు మెంబర్ల మెజార్టీతో తీర్మానం చేయించి పనులు చేసి పరిష్కరించడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చేయటానికి వీలులేదని పంచాయతీ సెక్రెటరీ, ఏఈ లను ఐరాంమూర్తి బెదిరించి బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపారు. తనే బ్లాక్ మెయిల్ చేస్తూ టిడిపి నాయకులపై నిరాధారమైన ఆరోపణ లు చేయటం దుర్మార్గమన్నారు. గత వైసిపి పాలనలో శావల్యాపురం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై అధికారులను బెదిరించటం, అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ను బ్లాక్మెయిల్ చేయడం తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకోవటం వెనుక నీ స్వార్థం ఏమిటనేది ప్రజలకు తెలిసిపోయిందన్నారు. నీ లాంటి బ్లాక్ మెయిలర్స్ కూడా బీసీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వైసిపి పాలనలో బీసీలపై అనేక దాడులు జరుగుతుంటే నీవు ఏమి చేశావని వారు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, అలాంటి పార్టీని విమర్శిస్తే బీసీలు క్షమించరని అన్నారు. టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అనేక కీలకమైన పదవులు బీసీలకు కల్పించిన పార్టీ టిడిపి అని తెలిపారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా శావల్యాపురం గ్రామంలో జరిగిన సభలో ఎవరిని టిడిపి నాయకులు విమర్శించలేదని, మెప్పుకోసం, కొందరిని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఐరాంమూర్తి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరికాదని, కేవలం డబ్బులకి ఆశపడి లోక్ సత్తా పార్టీ నుండి వైసీపీలో చేరిన ఐ రామ్మూర్తి సంగతి మండల ప్రజలందరికీ తెలుసునని, ఎన్నికల సమయాలలో ఏదో ఒక పార్టీలో చేరి గుర్తింపు పొందాలన్న తపన తప్ప మరొకటి లేదని టిడిపి నేతలు ఘాటుగా విమర్శించారు. బొల్లా బ్రహ్మనాయుడు హయాంలోనే కొత్తలూరు గ్రామంలో తాను పంచాయతీ సర్పంచ్ గా 500 మెజార్టీతో గెలిచానని టిడిపి మండల అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రం శావల్యాపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు మండల పరిధిలోని 15 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎన్టీఆర్ కు నివాళులర్పించారని, ఇది చూసిన ఐరామూర్తి ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నాడని వారు అన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కులాలకు ఎన్టీఆర్ హయాం నుండి నేటి వరకు టిడిపి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని వారన్నారు. ఐరాంమూర్తి గతంలో శావల్యాపురం సర్పంచ్ గా పనిచేసిన కాలంలో బిసి కి చెందిన రెవెన్యూ అధికారిని బెదిరించలేదా, బిల్లులు చెల్లింపులో అడ్డుకోలేదా అని వారు ప్రశ్నించారు. ఇంకా ఈ సమావేశంలో ఎన్.వెంకటేష్, టిడిపి సీనియర్ నాయకులు గోరంట్ల హనుమంతరావు, గద్దె వీర మస్తాన్ రావు పాల్గొన్నారు.(Story : ఐరాంమూర్తి బ్లాక్ మైలింగ్ ఆరోపణలు మానాలి )

