పేదల పక్షాన పనిచేసేందుకే తాను వైసీపీలో చేరాను..ఐరామూర్తి
న్యూస్ తెలుగు/వినుకొండ : శావల్యాపురం మండలంలో రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తూ, మద్యం బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తూ, ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ నేను హీరోని కాలేనని , వైసిపి రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు, వైసీపీ నాయకులు జుజ్జూరి ఐరామూర్తి మండల టిడిపి నేతలపై ఘాటుగా విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వంలో తాను పనిచేసేందుకే ఆ పార్టీలో చేరానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై విమర్శలు చేసే ముందు అసెంబ్లీ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏక వచనంతో సంబోధించిన విషయం టిడిపి నేతలు గుర్తుతెచ్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.(Story : పేదల పక్షాన పనిచేసేందుకే తాను వైసీపీలో చేరాను..ఐరామూర్తి )

