గంజాయి పై ఉక్కు పాదం
ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు పోలీసు సిబ్బంది స్టేషన్ ఎదుట ముమ్మరంగా వాహన తనిఖీలు సోమవారం నిర్వహించారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మందంజలో ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర హోంమంత్రి, వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్,ఎ ఎస్పి బొడ్డు హేమంత్ కుమార్ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా ఉంచడానికి చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ కు, భద్రాచలం వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి అనుకొని ఉన్న పోలీసు సర్కిల్ అయిన చింతూరు లో గంజాయి రవాణా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక సిబ్బందితో ప్రతిరోజు చింతూరు, మోతుగూడెం, డొంకరాయి పోలీస్ స్టేషన్ ల ఎదుట వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనుమానం వచ్చిన వ్యక్తుల వేలిముద్రలను ఆన్లైన్ ద్వారా పరీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ,ఎస్ఐలతో పాటు ప్రత్యేక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : గంజాయి పై ఉక్కు పాదం )

