పార్టీలకతీతంగా పనిచేద్దాం గ్రామాన్ని ప్రగతి పదంలో నిలబెడదాం
ఒకే ఒక్క సంవత్సరంలో మున్ననూర్ గ్రామాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
గ్రామంలో పాఠశాల అభివృద్ధికి రూ. కోటి మంజూరికి హామీ
న్యూస్ తెలుగు/వనపర్తి : గ్రామాల్లో ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా పనిచేస్తే గ్రామం త్వరితగతిన సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఇటీవల గ్రామాలలో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులందరూ ఓటు వేసిన వేయకుండా గ్రామస్తులందరూ మనవారేనని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని వనపర్తి శాసనసభ్యులు గౌరవనీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామంలో నిర్వహించిన ఉదయపు నడకలో ఆయన అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు
గ్రామంలోని వీధుల గుండా పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడారు
పలు సమస్యలను అక్కడే అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేయాలంటూ సూచించారు
గ్రామంలో విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరూ పాఠశాలను బలోపేతం చేసుకునేందుకు కృషి చేయాలి అన్నారు ఇందుకుగాను గ్రామంలో పాఠశాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున కోటి రూపాయలను మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు
గ్రామపంచాయతీకి పక్క భవన నిర్మాణం, పల్లె ధావకాన ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యల పరిష్కారం, గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, గ్రామం నుంచి ఏదుట్ల, కాశీంనగర్ గ్రామాలకు రోడ్ల నిర్మాణం, గ్రామంలోని శివాలయంలో కళ్యాణ మండపం ఏర్పాటు, గ్రామానికి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరి, మహిళా సంఘం బిల్డింగ్ ఏర్పాటు, ఇందిరా కాలనీలో ప్లాట్ల సమస్య పరిష్కారం, గ్రామంలోని కుల సంఘాలన్నింటికీ సామూహిక భవనాల ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
గ్రామాలలో నెలకొనే సమస్యలన్నీ తనకు తెలుసునని గ్రామ సర్పంచ్ పదవి దగ్గర నుంచి ఎంపీటీసీ ఎంపీపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు
తన సొంత గ్రామం మంగంపల్లిలో పూర్తి అభివృద్ధి సాధించామని తన సొంత గ్రామం లాగానే మున్ననూరు గ్రామాన్ని సైతం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా తను కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు
గత పాలకుల విషయం మనకు అవసరం లేద గతం గురించి మాట్లాడుకోవడం అనవసరమని ముందు నా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరం ముందుకెళ్లాలని ఎమ్మెల్యే గ్రామసులకు సూచించారు
ప్రస్తుతం గెలిపించిన సర్పంచులు వార్డు సభ్యులందరూ గ్రామానికి పెద్ద జీతగాడులా పనిచేసే గ్రామాన్ని సర్వోద్వోముఖాభివృద్ధి సాధించేలా చూడాలని ఆయన సూచించారు
కార్యక్రమంలో మున్ననూర్ గ్రామ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ సర్పంచ్ మమత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, గోపాల్పేట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి, మండల మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సత్యం, గ్రామ అధ్యక్షుడు ధీర మల్లు, యూత్ అధ్యక్షులు శశికుమార్, గ్రామ పెద్దలు గ్రామస్తులు గ్రామ మహిళలు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story : పార్టీలకతీతంగా పనిచేద్దాం గ్రామాన్ని ప్రగతి పదంలో నిలబెడదాం )

