వినుకొండ లో ఘనంగా ముగ్గుల పోటీలు
న్యూస్ తెలుగు / వినుకొండ : శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రాంతీయ జూనియర్ కళాశాలలో ఆవరణలో ప్రాంతీయ స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థినీలు ఏమని ఏ శ్యామల గెలుపొందారు. వారికి 10 వేల రూపాయలను శ్రీ సాయి హాస్పిటల్ వారు బహుకరించారు. ద్వితీయ బహుమతి ఏపీ మోడల్ స్కూల్ చీకటి గల పాలెం విద్యార్థులు ఓ నాగేశ్వరి ఈ అభి దేవిక గెలుపొందారు. వీరికి 7వేల వేల రూపాయలను శ్రీ బాలాజీ హాస్పిటల్ వారు అందజేశారు. అలాగే ద్వితీయ బహుమతి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీలు ఎం లక్ష్మి ఎస్ కృపావతి గెలుపొందారు. వీరికి బహుమతిని రిటైర్డ్ హెడ్మాస్టర్ చింతగుంట సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ పోటీలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో పరిసర ప్రాంతాలలోని 8 జూనియర్ కళాశాలలు ఆదర్శ పాఠశాలల నుండి కార్యక్రమానికి సహకరించిన మహిళా సాధికారిక కమిటీకి కళాశాల సిబ్బందికి విచ్చేసిన అతిధులకు విద్యార్థులకు మహిళా సాధికారక కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ జి స్వర్ణలత వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story:వినుకొండ లో ఘనంగా ముగ్గుల పోటీలు)

