ఆర్టీసీలో రోడ్డు భద్రత మాసోత్సవాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ డిపో లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుండి జనవరి 31 వరకు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రారంభ వేడుక ను శనివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయ లక్ష్మీ టౌన్ ఎస్సై, డిపో మేనేజర్ జె. నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభించారు. వక్తలు రహదారి భద్రత ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం లో ఎస్ టి ఐ ధనమ్మ, మెకానికల్ సూపరింటెండెంట్ సుగ్రీవుడు, ఆఫీసు ఇంచార్జి బి.మోహనరావు, ఖాజా, రమేష్, శివా నాయక్, మెకానికల్ సిబ్బంది, రన్నింగ్ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది మరియు ప్రయాణికులు అత్యధికంగా పాల్గొన్నారు.(Story : ఆర్టీసీలో రోడ్డు భద్రత మాసోత్సవాలు )

