సిపిఐ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : సిపిఐ కార్యాలయం శివయ్య భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సిపిఐ వంద సంవత్సరాల పండుగలో భాగంగా సిపిఐ కార్యాలయాన్ని ఇప్పటికే రంగు రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దగా, మరల నూతన సంవత్సరం సందర్భంగా మరింత కొత్త రూపం తెచ్చారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్, సిపిఐ సీనియర్ నాయకులు , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా , సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, శావల్యాపురం సిపిఐ మండల కార్యదర్శి ఆర్. వందనం, ఎస్కే కిషోర్, సిపిఐ నాయకులు శివయ్య భవన్లో ఉండగా.. పలు ప్రజా సంఘాలు, కార్మికుల సంఘాలు, నాయకులు, టైలర్స్ అసోసియేషన్ నాయకులు, ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు, ఇలా పలు కార్మిక వార్డ్ లోని నాయకులు పెద్ద ఎత్తున సిపిఐ కార్యాలయానికి వచ్చి సిపిఐ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిపిఐ నేతలు కూడా వచ్చిన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేసి, పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాచపూడి ఏసు పాదం, సంపెంగుల అబ్రహం, రాజు, కంచర్ల కోటేశ్వరరావు, సాయి, పచ్చి గొర్ల ఏసు, తదితరులు పాల్గొన్నారు.(Story : సిపిఐ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు )

