టిడ్కో ఇళ్ల సబ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద రూ. 2.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 KV సబ్ స్టేషన్కు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ.. కొత్త సబ్-స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల టిడ్కో ఇళ్ల విద్యుత్ సౌకర్యం, పరిసర ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తొలగి, నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. టిడ్కో నివాసితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ఇక్కడే ఒక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, కాలనీ సమీపంలోనే అత్యాధునిక వసతులతో కూడిన పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నిశ్శంకర శ్రీనివాసరావు, కొణిదల నాగ శీను, పీవీ సురేష్ బాబు, చైర్ పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, కర్నాటి వెంకటరెడ్డి, ముత్తినేని కొండలు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story:టిడ్కో ఇళ్ల సబ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జీవి)

