రేమిడిచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన హెచ్‌పీ పెట్రోల్ బంకు ప్రారంభం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల గ్రామంలో, బొల్లాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన హెచ్‌పీ పెట్రోల్ బంకును ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రైతులకు, ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తాయని తెలిపారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, బొల్లాపల్లి సొసైటీ ఛైర్మన్ పెసల వెంకట నారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : రేమిడిచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన హెచ్‌పీ పెట్రోల్ బంకు ప్రారంభం )

