ఆదివాసి సోషల్ మీడియా ప్రతిభ యువకుడిని సన్మానించిన వైద్యులు జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు/ చింతూరు: సోషల్ మీడియాలో ప్రతిభ కనబరుస్తూ అనేక రకాల వినూత్నమైన దృశ్యాలు సంఘటనలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్,యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ అనేక మందిని ఆకట్టుకున్న మడివి సంజు అనే ఆదివాసి యువకుడి ప్రతిభను గుర్తిస్తూ ఆయుర్వేద వైద్యులు జెకెసి చైర్మన్ జమాల్ ఖాన్ బుధవారం తన ఆవరణలోని నిమ్మలగూడెం గ్రామంలో శాలువాతో సన్మానించారు. ఆదివాసి యువకుల్లో ప్రతిభను వెలికి తీసి అన్ని రంగాల్లో రాణించాలని వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ పనులు చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రతిభ ఘనపరుస్తున్న ఇటువంటి యువకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు ఏకేసి సభ్యులు వినోద్ ఎస్ కే షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆదివాసి సోషల్ మీడియా ప్రతిభ యువకుడిని సన్మానించిన వైద్యులు జమాల్ ఖాన్)

