ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు లోని కస్తూరిబా విద్యాలయంలో 9 10 వ తరగతి విద్యార్దినులకు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు.వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.తద్వారా గ్రామం,రాష్ట్రం, దేశం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పనిచేయుచున్నటువంటి సంస్థ ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రథమ చికిత్స,హెల్తీ లైఫ్ స్టైల్(ఆరోగ్య జీవన విధానం) కార్డియాక్ అరెస్టు జరిగినప్పుడు చేయవలసిన అత్యవసర చికిత్స సిపిర్ లపై శిక్షణ కార్యక్రమం చేపట్టారు.తర్వాత 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వివిధ గ్రామాల నుండి వచ్చిన 30 మంది అభ్యర్థులకు ప్రథమ చికిత్స,గృహ వైద్యం,హెల్దీ లైఫ్ స్టైల్, సిపిర్ లపై శిక్షణ నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్యభారతి,ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ పి శ్రీనివాసరావు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ (రాజమండ్రి) డాక్టర్ ఏవి యల్ నారాయణ ,కార్యదర్శి,
ఆరోగ్యభారతి(ఆంధ్ర ప్రదేశ్) దీనదయాల్ హాస్పిటల్ (నాగాయలంక ) పాల్గొని అభ్యర్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కార్యక్రమం కల్పించారు.ఈ కార్యక్రమంలో చింతూరు సేవాభారతి వైద్యులు గంగాధర ప్రసాద్ పాల్గొన్నారు.(Story :ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ )

