Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలి 

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలి 

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలి 

వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపు.

న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న మహా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శాసనసభ్యులు మాట్లాడుతూ. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు తప్పనిసరిగా హాజరై సోమవారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని, ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాలని నాయకులు పిలుపునిచ్చారు.(Story : పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలి  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments