Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బస్సును సీజ్ చేసిన చింతూరు పోలీసులు

బస్సును సీజ్ చేసిన చింతూరు పోలీసులు

బస్సును సీజ్ చేసిన చింతూరు పోలీసులు

న్యూస్ తెలుగు/ చింతూరు : పరిమితికి మించి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని రవాణా చేస్తున్న బస్ ను చింతూరు ఎస్సై రమేష్ శనివారం రాత్రి సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రం నుండి కుంట మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని చట్టి జంక్షన్ నుండి విజయవాడ వెళుతుండగా చట్టి వద్ద ఎస్సై తనిఖీలు నిర్వహించారు. సంగీత ట్రావెల్స్ కు చెందిన బస్సులో 110 మంది ప్రయాణికులు ప్రయాణించటం గమనించి బస్సును సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం 35 మంది బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఈ బస్సులో సుమారు మైనర్లు, మేజర్లు, చంటి పిల్లలతో సహాసుమారు 110 మంది ప్రయాణిస్తున్నారు. ఇది గమనించిన ఎస్సై బస్సును సీజ్ చేశారు. అలాగే బస్సు(సిజి 19 యఫ్ 3366) లో డ్రైవర్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారు. ఇటీవల ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురి కావటం జరుగుతుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠిన తరం చేసిందని తెలిపారు. గురువారం రాత్రి కూడా మారేడు మిల్లి ఘాట్ రోడ్లో ట్రావెల్ బస్సు బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో శనివారం నుండి రాత్రి పది నుండి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిషేధించినట్లు చింతూరు సిఐ గోపాలకృష్ణ విలేకరులకు తెలిపారు. సంగీత ట్రావెల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.(Story : బస్సును సీజ్ చేసిన చింతూరు పోలీసులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!