ఓటు వేయండి..గోవర్ధనగిరి అభివృద్ధి బాధ్యత నాది
న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట/ అక్కన్నపేట: తనను గెలిపిస్తే ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బలపరిచిన గోవర్ధనగిరి సర్పంచ్ అభ్యర్థి పెండెల రమ బాల కొమురయ్య ముదిరాజ్ అన్నారు.రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తాననీ..తనను గెలిపిస్తే ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ సర్పంచ్ గెలిపిస్తే రాజకీయాలకు అతీతంగా గోవర్ధనగిరి గ్రామపంచాయతీకి వన్నె తెచ్చేలా పాలన అందించేందుకు పాటు పడతానన్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తమను గెలిపిస్తే గోవర్ధనగిరి గ్రామాన్ని హుస్నాబాద్ మండలంలో కలిపేలా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని,ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని, తాగునీటి, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్య లేకుండా చూస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.(Story : ఓటు వేయండి..గోవర్ధనగిరి అభివృద్ధి బాధ్యత నాది )

