జూదరుల అరెస్ట్
న్యూస్ తెలుగు/వినుకొండ : బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామ శివారులో ఫారెస్ట్ లో కోతముక్క ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను బండ్లమొట్టు పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్.డి షమీర్ భాష, సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పందెంగా ఉపయోగిస్తున్న 15,300 నగదును సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు.(Story : జూదరుల అరెస్ట్ )
