ఉచిత గ్యాస్ కు దరఖాస్తుల వెల్లువ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక అంబేద్కర్ కాలనీ లో పేద ప్రజలను ఆదుకునేందుకు గ్యాస్ లేని మహిళలు కట్టెలతో వంట చేసుకున్నప్పుడు వారి కంట కన్నీరు పెట్టడం అనేక ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ ఉజ్వల పథకాన్ని వినుకొండ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుమారు 350 మంది చేత దరఖాస్తులు పెట్టించడం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం వినుకొండ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో కూడా పెట్టిన 35 దరఖాస్తులతో కొంతమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లు పల్నాడు జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ చేతుల మీదుగా అందజేశారు.. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ. నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలు పేద మహిళల కోసం ఉచిత గ్యాస్ కనెక్షన్లు కొరకు అర్జీలు పెట్టించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పోలా మరియమ్మ, లక్ష్మీపతి, అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.(Story : ఉచిత గ్యాస్ కు దరఖాస్తుల వెల్లువ )
