మారేడు మిల్లి ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా
9 మంది మృతి
20 మంది గాయాలు ,ఐదుగురు పురుషులు,నలుగురు స్త్రీలు
అందరూ చిత్తూరు వాసులే
స్త్రీలు సహాయక చర్యల్లో చింతూరు ఐ టి డి ఏ పి ఓ

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలం మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బోల్తా పడి ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడ మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీవిగ్నేశ్వర ట్రావెల్స్( ఏపీ 39 యు 65 43 ) అనే బస్సులో చిత్తూరుకు చెందిన 3చిత్తూరుకు చెందిన 36 మంది యాత్రికులతో ఆరవ తేదీన పుణ్యక్షేత్రాలకు చిత్తూరు నుండి కోటప్పకొండ మీదుగా యాత్ర మొదలైంది. వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని గురువారం రాత్రి అరకులోయ నుండి భద్రాచలం వచ్చేందుకు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో వస్తూ ఉండగా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాదవశాత్తు తులసిపాక గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలోని దుర్గమ్మ గుడికి సమీపంలో చైనా వాల్ దగ్గర మూలం మలుపు వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు పురుషులు4గురు మహిళలు మొత్తం 9 మంది అక్కడకు అక్కడే మృతి చెందారు. ప్రమాదంలోమృతి చెందిన వారు చిత్తూరు, బెంగళూరుకి చెందినవారు ఉన్నారు. అరకులోయ నుండి భద్రాచలం రామాలయం దర్శనానికి వస్తూ 9 మంది కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 వాహనాల ద్వారా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగతి తెలుసుకున్న చింతూరు ఐటిడి ఎ పిఓ శుభం నొక్వాల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సత్వర సహాయక చర్యలను పర్యవేక్షించారు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ పుల్లయ్య, చింతూరు సిహెచ్ సి డాక్టర్ కోటిరెడ్డి పర్యవేక్షణలో వైద్యులు ప్రధమ చికిత్సలు అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37 మంది మొత్తం ప్రయాణిస్తున్నారు.

బెంగళూరుకు చెందినవారు 12 మంది ఉండగా, చిత్తూరుకి చెందినవారు 25 మంది ఉన్నారు. 37 మందిలో ఇద్దరు డ్రైవర్లతో పాటు వంట మనుషులు ఉన్నారు. చెందినవారు 1.ఎస్వి నాగేశ్వరరావు, 2.శివశంకర్, 3.మధు, 4.ఉమా రెడ్డి,5.కృష్ణ కుమార్ కాగా మహిళలు6. శైలజా రాణి.7, శ్యామల,8 సునంద,9. శ్రీకళ, మృతుల్లో ఉన్నారు. మృతదేహాలను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి చింతూరులో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హుటాహుటిన చింతూరు చేరుకొని ప్రమాదం జరిగిన వివరాలు తెలుసుకొని బాధితులకు అందుతున్న సేవలను అడిగిఆదేశించారు తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.(Story : #Post Excerpt మారేడు మిల్లి ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా :9 మంది మృతి )

